New Zealand Beat Pakistan by 60 Runs: తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమి, సెంచరీలతో అదరగొట్టిన విల్ యంగ్, టామ్ లేథమ్
321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఖుష్‌దిల్ (69; 49 బంతుల్లో), బాబర్ అజామ్ (64; 90 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ అఘా (42; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడారు. సౌద్ షకీల్ (6), మహ్మద్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
Islamabad, FEB 19: ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ (Nz vs Pak) ఓటమిపాలైంది. పాక్‌పై కివీస్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. విల్ యంగ్ (107; 113 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లేథమ్ (118; 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో విరుచుకుపడ్డారు. గ్లెన్ ఫిలిప్స్ (61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 ఫోర్లు) దూకుడుగా ఆడి అర్ధ శతకం బాదాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 2, హారిస్ రవూఫ్ 2, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
New Zealand Beat Pakistan by 60 Runs
అనంతరం 321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఖుష్‌దిల్ (69; 49 బంతుల్లో), బాబర్ అజామ్ (64; 90 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ అఘా (42; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడారు. సౌద్ షకీల్ (6), మహ్మద్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో విలియం ఓరోర్క్ 3, మిచెల్ శాంట్నర్ 3, మ్యాట్ హెన్రీ 2, మైఖేల్ బ్రాస్‌వెల్, నాథన్ స్మిత్ చెరో వికెట్ తీశారు.